FTL Limits | దుండిగల్, ఏప్రిల్ 17: బాచుపల్లి మండల రెవెన్యూ అధికారులు ఇవాళ మండల పరిధిలోని ప్రభుత్వ భూములు, చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలో వెలసిన నిర్మాణాలను తొలగించారు. బాచుపల్లి మండలం నిజాంపేట తురక చెరువు ఎఫ్టీఎల్ పరిధిలో వెలిసిన ఓ నిర్మాణంతోపాటు సర్వేనెంబర్ 191 సైదప్ప కాలనీలోని ఓ నిర్మాణంపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి.
ఇవాళ తహసీల్దార్ పూల్ సింగ్ ఆదేశం మేరకు గిర్దావర్ భానుచందర్ ఆధ్వర్యంలో రెండు నిర్మాణాలను జేసీబీ సహాయంతో తొలగించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన చెరువు, కుంటల ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టినా ఉపేక్షించేది లేదని రెవెన్యూ అధికారులు హెచ్చరించారు.
Minister Ponguleti | భూ వివాదాలు లేని రాష్ట్రంగా భూ భారతి చట్టం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
Amit Shah: సీఆర్పీఎఫ్ 86వ రైజింగ్ డే.. 2026 నాటికి నక్సలిజం ఇక చరిత్రే: అమిత్ షా
Illegally Sand | అక్రమంగా నిల్వ చేసిన ఇసుకను సీజ్ చేసిన తహసీల్దార్ అనిత