మల్కాజిగిరి, మే 19 : విద్యుత్ షాక్‌తో భవన నిర్మాణ కార్మికురాలు మృతి చెందిన సంఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్ఐ సునీల్ కుమార్ కథనం ప్రకారం.. ఐఎన్ నగర్‌కు చెందిన రవి,కవిత(30) దంపతులు భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. ఆదివారం ఉదయం భార్య భర్తలు ఐఎన్ నగన్లోని కట్ట మైసమ్మ వద్ద ఉన్న భవనంలో పనిచేస్తున్నారు. కాగా, రవి రెండవ అంతస్తులు పనిచేస్తూ ఇనుప రాడ్డను తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు పక్కన ఉన్న విద్యుత్ తీగలకు రాడు తాకింది. వెంటనే రవికి విద్యుత్ షాక్ తగిలి కింద పడిపోయాడు. భర్త రవిని రక్షించడానికి చేసే ప్రయత్నంలో కవితకు కూడా విద్యుత్ షాక్ తగలడంతో అపస్మారక స్థితిలోకి వెళ్లింది.
వెంటనే చికిత్స కోసం భార్యాభర్తలను స్థానిక దవాఖానకు తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స తర్వాత మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ దవాఖానకు తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే కవిత మృతి చెందిందని నిర్ధారించారు. రవికి చికిత్స చేస్తున్నారు. కవిత తల్లి దేవిలి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే ఇంటి యజమాని బాలరాజు, మేస్త్రి భాస్కర్ ప్రమాదం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోలేదని పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.