MLA Marri Rajashekar Reddy | మల్కాజిగిరి, జూన్ 11 : కాంగ్రెస్ పార్టీ దిగజారుడు రాజకీయాలతో కాళేశ్వరం ప్రాజెక్టును రాజకీయం చేస్తుందని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మండిపడ్డారు. బుధవారం రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను ఎంక్వైరీ కమిషన్ పిలవడంతో ఆయనకు మద్దతుగా ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు, నాయకులు బీఆర్కే భవన్కు తరలివెళ్లారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు న్యాయ విచారణ కమిషన్ (జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్) ముందు హాజరై ధీటుగా సమాధానాలు చెబుతారని అన్నారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ జగదీష్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు బద్ధం పరశురాం రెడ్డి, రావుల అంజయ్య, జేఏసీ వెంకన్న, రాము యాదవ్, ఏకే మురుగేష్ , అనిల్ కిషోర్ గౌడ్, అమిరుద్దీన్, జీకే హనుమంతరావు, చిన్న యాదవ్, లడ్డు నరేందర్ రెడ్డి, హేమంత్ పటేల్, శివ గౌడ్, చిందం శ్రీనివాస్, అరుణ్ రావు తదితరులు పాల్గొన్నారు.
కాగా కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారణ ఇవాళ ముగిసిన విషయం తెలిసిందే. కేసీఆర్ను కాళేశ్వరం కమిషన్ చైర్మన్ జస్టిస్ పీసీ ఘోష్ 50 నిమిషాల పాటు విచారించారు.
‘అశుద్ధ’ జలం..! గాగిళ్లాపూర్లో కలుషితమవుతున్న తాగునీరు
UPI Payments | రూ.3వేలు దాటిన యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు..?
BRK Bhavan | తెలుగు తల్లి ఫ్లై ఓవర్పై ఫొటో జర్నలిస్టులను అడ్డుకున్న పోలీసులు