Garbage Dump | కుత్బుల్లాపూర్, ఏప్రిల్1 : అది శ్రీరామ్ నగర్‌కు వెళ్లే ప్రధాన దారి.. రోడ్డుకు ఇరువైపులా చెత్తకుప్పలు దర్శనమిస్తుంటాయి. కాలనీ వాసులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా అధికారులెవరూ పట్టించుకోకపోవడం గమనార్హం.
ఆ దారి గుండా వెళ్లాలంటే ముక్కు మూసుకోవాల్సిందే. నిత్యం జనం తిరిగే కాలనీలో చెత్త కుప్పలు తిప్పలుగా పేరుకుపోతుంది. అటువైపు ఏ ఒక్క అధికారి కూడా పర్యవేక్షణ ఉండదు. ఇక కిందిస్థాయి సిబ్బంది మాత్రం శరా మామూలే అన్న చందంగా ఉన్నారు.
కుత్బుల్లాపూర్ సర్కిల్ 25 పరిధిలో కుత్బుల్లాపూర్ డివిజన్ బాపునగర్ నుండి శ్రీరామ్ నగర్‌కు వెళ్లే ప్రధాన దారికి ఇరువైపులా చెత్త కుప్పలు తెప్పలుగా పేరుకుపోయి దర్శనమిస్తుంది. కాలనీవాసులు, స్థానికంగా ఉండే ప్రైవేట్ స్కూలుకు వెళ్లే విద్యార్థులు నిత్యం ఈ చెత్తకుప్పలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
సంబంధిత అధికారులు ఇప్పటికైనా స్పందించి కాలనీలో పేరుకుపోతున్న చెత్తకుప్పలను ఎప్పటికప్పుడు తొలగించేలా చర్యలు తీసుకోవాలని కాలనీవాసులు కోరుతున్నారు.
Caste census funds | కుల గణన నిధులు విడుదల చేయాలని కలెక్టర్‌కు లేఖ
Gas Leak | ట్యాంకర్ నుంచి నైట్రోజన్ గ్యాస్ లీక్.. ఫ్యాక్టరీ ఓనర్ మృతి.. 40 మంది ఆస్పత్రిపాలు..!
Firecracker Factory | బాణసంచా కర్మాగారంలో పేలుడు.. ముగ్గురు మృతి