అల్వాల్ అక్టోబర్19 : భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి శతజయంతోత్సవాల సందర్భంగా అల్వాల్ పారిశుధ్య కార్మికులకు సత్యసాయి బాబా రాష్ట్ర సంస్థల అధ్యక్షులు పి.వెంట్రావు దుస్తులు పంపిణీ చేశారు. ఆదివారం అల్వాల్ పట్టణ కేంద్రంలోని శ్రీసత్యసాయి బాబా శతజయంతోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. విద్యార్థులకు మన భవిష్యత్తు వర్తమానంలో మనం చేసే పనులపై ఆధారపడి ఉంటుంది.వ్యాస రచన పోటీలు నిర్వహించగా సుమారు 30 వేల మంది విద్యార్థులు పాల్గొనగా వారికి ప్రశంశ పత్రాన్ని అందజేశారు.ఈ కార్యక్రమంలో శ్రీ సత్యసాయి సేవా సంస్థ ప్రతినిధులు పారిశుధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు.