మల్కాజిగిరి ఏప్రిల్ 24 : కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్స్ చట్టాన్ని రద్దు చేయాలని సీఐటీయూ నాయకులు డిమాండ్ చేశారు. గురువారం మల్కాజిగిరిలోని పార్టీ కార్యాలయంలో మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని కోరుతూ పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలన్నారు.
కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ మే 20న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి నర్సింగరావు, యాదగిరి, ఆల్ ఇండియా పెన్షనర్స్ అసోసి యేషన్ నాయకులు విజయ్ కుమార్, సీపీఎం నాయకులు కృపా సాగర్, అవుట్ సోర్సింగ్ కార్మికురాలు స్వాతి తదితరులు పాల్గొన్నారు.