వినాయక్‌నగర్, ఏప్రిల్ 6: అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్ హక్కుల కోసం పోరాడుతామని తెలంగాణ అంగన్వాడీ టీచర్స్, అండ్ హెల్పర్స్ యూనియన్ మేడ్చల్ జిల్లా సిఐటీయూ కార్యదర్శి బి శోభారాణి అన్నారు. సోమవారం వినాయక్‌నగర్‌లో భారత కార్మికోద్యమ ఉపాధ్యాయుడు కామ్రేడ్ బి.టి. రణదివె వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశంలో రణదివే కార్మికుల హక్కుల కోసం నిరంతరం పోరాడుతామన్నారు. ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. చాలి చాలని జీతాలతో అంగన్వాడీల పరిస్థితి దుర్భంగా మారిందన్నారు. కనీస వేతనం 18వేలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో టీచర్స్, హెల్పర్స్ పాల్గొన్నారు.