కారేపల్లి,ఆగస్టు 4 : యువత తమకు వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఖమ్మం జిల్లా కారేపల్లి సీఐ బి.తిరుపతిరెడ్డి అన్నారు. సింగరేణి మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయ సమీపంలో ఆదివాసి గిరిజన యువకుడు కుంజా కృష్ణ ప్రసాద్ ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన డెక్కన్ చాయ్ స్టాల్ ను సోమవారం సీఐ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా సీఐ తిరుపతిరెడ్డి మాట్లాడుతూ యువతీ యువకులు చదివిన చదువులకు ప్రభుత్వ ఉద్యోగాలు రావడం లేదని నిరాశకు గురికావొద్దన్నారు.
బయట ప్రపంచంలో ఎన్నో ఉపాధి అవకాశాలు ఉన్నాయనే విషయాన్ని గుర్తించి ఉపాధి అవకాలను చూసుకోవాలన్నారు. అంతకుముందు ప్రముఖ పురోహితుడు కొండపల్లి శ్రీనివాస శర్మ ప్రత్యేక ప్రారంభోత్సవ పూజలు చేశారు.ఈ కార్యక్రమంలో చీమల మహేందర్, పులసం భద్రం, కుంజా వెంకటేశ్వర్లు, కుంజా భరత్, ఈసం ఫణిందర్, చీమల శైలు, కుంజా మానస, మోకాళ్ల సతీష్, ముక్తి కోటేష్, ఈసాల ఛాయాదేవి, ఈసాల వెంకటేశ్వర్లు, పొదేం రామూర్తి, బొర్రా స్వామి, పొడుగు హరీష్, దుస్సా నరేష్ తదితరులు పాల్గొన్నారు.