మల్కాజిగిరి, జూలై 3 : పండగలు మతసామరస్యానికి ప్రతీకని మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ అన్నారు. గురువారం మల్కాజిగిరి చౌరస్తాలోని స్వాగత్ హాల్లో బోనాల పండుగ పురస్కరించుకొని మల్కాజ్గిరి శాంతి సంఘాల సమావేశం పోలీసులు నిర్వహించారు. ఈ సందర్భంగా సత్యనారాయణ మాట్లాడుతూ.. బోనాల పండుగ సందర్భంగా ఏర్పాటు చేసే మండపాలను భక్తులకు అనుగుణంగా ఏర్పాటు చేయాలని అన్నారు.
పండగ సందర్భంగా మండపాల వద్ద డీజేలను అనుమతించమని అన్నారు. శాంతి భద్రతలకు ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా నాణ్యమైన విద్యుత్ తీగలను వినియోగించుకోవాలని, నిర్వాహకులు రాత్రులలో మండపాలలో కాపలాగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శాంతి సంఘాల నాయకులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.