Child Missing Case | శామీర్ పేట, జూన్ 26 : గంటలోపు తప్పిపోయిన చిన్నారిని ఆచూకిని పోలీసులు కానే ఉన్నారు. ఈ ఘటన శామీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం సాయంత్రం జరిగింది.
వివరాల్లోకి వెళితే.. అజయ్ కుమార్, చందా కుమారి దంపతులు అలియాబాద్ క్రాస్ రోడ్ సమీపంలోని సత్యనారాయణ ఆలయం గోశాలలో పనిచేస్తున్నారు. వారి 28 నెలల బాలుడు గురువారం 6.45 గంటల ప్రాంతంలో గోశాల వద్ద ఆడుకుంటూ తప్పిపోయాడు.
తల్లిదండ్రులు పరిసర ప్రాంతాల్లో వెతికినా తమ కొడుకు కనిపించకపోవడంతో ఆందోళనకు గురై శామీర్‌పేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సీఐ శ్రీనాథ్ సిబ్బంది సహాయంతో 7.30 గంటల వరకు వెతికి బాలుడిని ఆచూకీని కనుగొన్నారు. అనంతరం ఆ చిన్నారిని తల్లిదండ్రులను పిలిచి అప్పగించారు. తమ ఫిర్యాదుకు వెంటనే స్పందించి బాబును వెతికిపెట్టిన శ్రీనాథ్‌కు, సిబ్బందికి అజయ్ కుమార్ దంపతులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
Jagtial | జగిత్యాల జిల్లాలో కొండెక్కిన చింత చిగురు ధరలు.. కిలో ఎంతంటే?
MLC Kavitha | రేవంత్ రెడ్డి అవినీతి చక్రవర్తి.. ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
Stampede | పాఠశాల వద్ద పేలుడు.. తొక్కిసలాటలో 29 మంది చిన్నారులు మృతి