chamakura mallareddy | ఘట్కేసర్, ఏప్రిల్ 18: నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు మేడ్చల్ ప్రజలకు సేవలు అందిస్తూనే ఉంటానని మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ యంనంపేట్ చౌరస్తాలో మల్లారెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం, మజ్జిగ కేంద్రాన్ని శుక్రవారం ఆయన ప్రారంభించారు.
అనంతరం మల్లారెడ్డి మాట్లాడుతూ.. అధికారమిచ్చి అందలం ఎక్కించి ఎనలేని గౌరవాన్ని అందించిన మేడ్చల్ నియోజకవర్గ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం పని చేస్తానని హామీ ఇచ్చారు. నియోజకవర్గంలోని అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి సహకరిస్తూ ఆదుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మల్లారెడ్డి హెల్త్ సిటీ చైర్మన్ చామకూర భద్రారెడ్డి, ఘట్ కేసర్ మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, పోచారం మున్సిపల్ అధ్యక్షుడు సురేందర్ రెడ్డి, బోడుప్పల్ కార్పోరేషన్ అధ్యక్షుడు మంద సంజీవ రెడ్డి, పోచారం మున్సిపల్ చైర్మన్ బోయపల్లి కొండల్ రెడ్డి, ఘట్ కేసర్ మున్సిపల్ వైస్ చైర్మన్ మాధవరెడ్డి, మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు రమేశ్, ప్రధాన కార్యదర్శి పన్నాల కొండల్ రెడ్డి, మాజీ కౌన్సిలర్లు వెంకట్ రెడ్డి, ఆంజనేయులు గౌడ్, అనురాధ, జహంగీర్, నర్సింగ్ రావు, నాయకులు కార్యకర్తలు మహిళలు పాల్గొన్నారు.