Free Computer Coaching | చర్లపల్లి, జూన్ 7 : ఉచిత కంప్యూటర్ శిక్షణ, ఉద్యోగ అవకాశాలకు దరఖాస్తులను స్వీకరిస్తున్నామని క్యాడర్ టెక్ మహీంద్రా ఫౌండేషన్ ప్రతినిధి నాగరాజు పేర్కొన్నారు. శనివారం కుషాయిగూడలో ఆయన మాట్లాడుతూ.. క్యాడర్ టెక్ మహీంద్రా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతీ, యువకులకు కంప్యూటర్ కోర్సులలో ఉచితంగా నాలుగు నెలల పాటు శిక్షణ ఇస్తున్నామని తెలిపారు.
శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్ధులకు వివిధ కార్పొరేట్ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని, 18 నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్న యువతీ, యువకులు కోర్సును సద్వినియోగం చేసుకొవాలని సూచించారు. ఈసీఐఎల్‌లోని తమ కార్యాలయంలో వివరాలు, పేర్లను నమోదు చేసుకొవాలన్నారు. ఇతర వివరాలకు ఫోన్ నెంబర్ 9100056583లో సంప్రదించాలని ఆయన కోరారు.
Read Also :
Hospital Staff | అమానుషం.. ఐసీయూలోని రోగికి మత్తుమందు ఇచ్చి అత్యాచారం
Bakrid Celebrations | ఘనంగా బక్రీద్ వేడుకలు.. ఈద్గాల వద్ద ప్రార్థనలు చేసిన ముస్లిములు