Bike Accident | కుత్బుల్లాపూర్, మార్చి 29 : బైక్‌పై అతివేగంతో వెళ్లిన విద్యార్థి హోర్డింగ్‌ను ఢీకొట్టి తీవ్ర గాయాలు కాగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ సంఘటన పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుర్కయాంజల్ బీఎన్ రెడ్డి నగర్ కు చెందిన రావత్ యశ్వంత్(25) గుండ్ల పోచంపల్లిలో మల్లారెడ్డి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ రెండవ సంవత్సరం చదువుతున్నాడు.
కళాశాల సమీపంలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రిలో ఉంటూ విద్యను అభ్యసిస్తున్నాడు. ఈనెల 28న మధ్యాహ్నం సమయంలో తన స్నేహితుడు అభినవ్ సింగ్‌తో కలిసి బైక్‌పై బయటకు వెళ్లాడు. ఈ క్రమంలో తిరిగి మధ్యాహ్నం సమయంలో హాస్టల్‌కు వస్తున్న మార్గ మధ్యలోని దూలపల్లి పెట్రోల్ బంక్ మూల మలుపు వద్ద అతివేగంతో వెళ్లి రోడ్డు పక్కన ఉన్న హార్డింగ్‌ను ఢీకొట్టాడు.
దీంతో యశ్వంత్‌కు తీవ్ర గాయాలు కాగా స్థానికులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. యశ్వంత్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా రాత్రి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. బాధిత కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Kathmandu | నేపాల్‌లో హింస.. 100 మంది అరెస్ట్
Chilli Farming | సస్యరక్షణ చర్యలతోనే మిర్చి అధిక దిగుబడులు: డాక్టర్ ఎం వెంకటేశ్వర్ రెడ్డి
Heart Health | ఈ ఆహారాలను తింటే మీకు గుండె పోటు అసలు రాదు.. గుండె ఆరోగ్యంగా ఉంటుంది..