MLA Marri Rajashekar Reddy | మల్కాజిగిరి, మార్చి 26 : పోటీ ప్రపంచంలో విద్యార్థులు రాణించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం మల్కాజిగిరిలోని ప్రభుత్వ స్కూల్ విద్యార్థులు శాసనసభ వ్యవహారాలను పరిశీలించడానికి వెళ్లారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులకు చట్ట సభలలో ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు లేవనెత్తుతున్న అంశాల గురించి అవగాహన కల్పించడం అందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగ్యానందరావు, కిరణ్కుమార్, వంశీ ముదిరాజ్, ఉస్మాన్, సంతోష్ గుప్తా, మారుతి, ప్రసాద్, దుర్గేష్, స్వామి, జంగయ్య, నాగరాజు, కాశీనాథ్, గణేష్, శీను, దినేష్, నవాబ్ తదితరులు పాల్గొన్నారు.