చర్లపల్లి, ఏప్రిల్ 26 : జమ్మూకశ్మీర్ పహల్గాం పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడి, నరమేధం అమానుషమని చర్లపల్లి డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు నేమూరి మహేశ్‌గౌడ్, సీసీఎస్ అధ్యక్షుడు ఎంపెల్లి పద్మారెడ్డిలు అన్నారు.
జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు చేసిన దాడిని నిరసిస్తూ చర్లపల్లి డివిజన్ పరిధిలోని మధురానగర్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఇవాళ మధురానగర్, కటింగ్ కాలనీ, టీచర్స్ కాలనీ, స్నేహపురి కాలనీల మీదుగా చక్రీపురం చౌరస్తా వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు చేసిన దాడిని ప్రతీ ఒక్కరు ఖండించాలన్నారు. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలని వారు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మధురానగర్, ఇందిరానగర్, చక్రీపురం సంక్షేమ సంఘం ప్రతినిధులు, మహిళలు, యువతి, యువకులతో పాటు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఈ నెల 22న జమ్మూకశ్మీర్ లోని అనంత్‌నాగ్ జిల్లా పహల్గాంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన బైసరన్‌లో ఉగ్రవాదులు నరమేధానికి పాల్పడి 26 మంది పర్యాటకులను హతమార్చిన సంగతి తెలిసిందే.
Amberpet | రజతోత్సవానికి రెడీ.. అంబర్‌పేటలో ముందే మురిసిన గులాబీ జెండా