KCR Birthday | ఘట్కేసర్, ఫిబ్రవరి 13 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ స్ఫూర్తితో ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి.. భవిష్యత్ తరాలకు ఉజ్వల భవిష్యత్‌ను అందించాలని ఘట్కేసర్ బీఆర్ఎస్ మున్సిపల్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్ కోరారు. ఘట్ కేసర్ మున్సిపాలిటీ పరిధిలో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు పుట్టినరోజు సందర్భంగా మాజీ రాజ్యసభ సభ్యులు గ్రీన్ చాలెంజ్ అధినేత జోగునపల్లి సంతోష్ విసిరిన చాలెంజ్ ను ఘట్ కేసర్ మున్సిపాలిటీ బీఆర్ఎస్ అధ్యక్షుడు బండారి శ్రీనివాస్ గౌడ్, మున్సిపాలిటీ మాజీ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి ఆధ్వర్యంలో చాలెంజ్ స్వీకరించి గురువారం మొక్కలు నాటారు.
బంగారు తెలంగాణ సాధనకర్త కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదినం పురస్కరించుకుని దేశవ్యాప్తంగా సంతోష్ చేపట్టిన గ్రీన్ ఛాలెంజ్‌ను ప్రతి ఒక్కరూ స్వీకరించాలన్నారు. ప్రతి ఒక్కరూ మూడు మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. జోగులపల్లి సంతోష్ ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో మున్సిపాలిటీ మాజీ కౌన్సిలర్లు చందుపట్ల వెంకట్ రెడ్డి, బండారి ఆంజనేయులు గౌడ్, మాజీ ఎంపీటీసీ చిలుకూరి గోపాల్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు అబ్దుల్ అజీజ్, దేవరకొండ రాజా చారి, బిజిలి సదానంద్, ఎండీ నజీర్, అబ్బగోని నాగరాజు గౌడ్, బానుక నవీన్, లక్ష్మయ్య, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ ఎండీ సిరాజ్, బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.