దుండిగల్, మే 13: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు అన్నారు. కుత్బుల్లాపూర్ నియోజవర్గానికి చెందిన పలువురు ప్రజా ప్రతినిధులు, తాజా మాజీ ప్రజా ప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు శంబీపూర్లోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా తమ ప్రాంతాలలో నెలకొన్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని విన్నవించారు. సానుకూలంగా స్పందించిన రాజు ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని తెలిపారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా పలు ప్రాంతాల్లో జరగబోయే శుభకార్యక్రమాల వేడుకల్లో పాల్గొనాలని పలువురు ఆహ్వాన పత్రికలను అందజేశారు.