కీసర, మే 30 : ప్రమాదవశాత్తు చెరువులో పడి బాలుడి మృతి చెందిన సంఘటన కీసర పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. దమ్మాయిగూడ మున్సిపాల్టీ పరిధి అంకిరెడ్డిపల్లిలోని శ్యామలకట్ట చెరువులో గ్రామానికి చెందిన కుంట వెంకటేశ్ కుమారుడు కుంట కేతన్ (6) సంవత్సరాలు ప్రమాదవశాత్తు చెరువు కుంటలో బాలుడు పడిపోయాడు.
విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బాలుడిని చికిత్స నిమిత్తం ఘట్కేసర్లోని ప్రభుత్వ దవాఖానకు చికిత్స నిమిత్తం తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే చిన్నారరి మృతి చెందిన్నట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడు తండ్రి వెంకటేశ్ ఫిర్యాదు మేరకు కీసర పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.