Bonthu Sridevi | చర్లపల్లి, జూన్ 16 : చర్లపల్లి డివిజన్ పారిశుద్ద్య పనులను వేగవంతం చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ స్టాడింగ్ కమిటీ సభ్యురాలు, డివిజన్ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని చర్లపల్లి, కుషాయిగూడలో శానిటేషన్ ప్రత్యేక డ్రైవ్‌ను శానిటరి అధికారి సుదర్శన్‌తో కలిసి ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. డివిజన్‌ను స్వచ్ఛ డివిజన్‌గా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ప్రతీ ఒక్కరు తమ పరిసరాలను శుభ్రంగా ఉంచుకొవాలని ఆమె సూచించారు. డివిజన్లోని కాలనీవాసులు స్వచ్ఛత పాటించడంతోపాటు చెత్త సేకరించే సిబ్బందికే చెత్తను అందించాలని ఆమె సూచించారు. డివిజన్లో పారిశుద్ద్య సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు సీతరామిరెడ్డి, నాగిళ్ల బాల్‌రెడ్డి, శ్రీకాంత్‌యాదవ్, గోపాల్‌యాదవ్, భానుచందర్, మల్లేశ్లతోపాటు జవాన్లు, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Inter Results | ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల.. ఫస్టియర్‌లో 67.. సెకండియర్‌లో 50శాతం పాస్
OTT | డైరెక్ట్‌గా ఓటీటీలోకి ఉప్పు కప్పురంబు.. స్ట్రీమింగ్ డేట్ ఎప్పుడంటే..!
Narsimhulapeta | ఖాజామియాకు ఆర్థిక సాయం అందజేత