Asha Workers | శామీర్ పేట్, మార్చి 19 : అరెస్టులతో పోరాటాన్ని ఆపలేరని ఆశా కార్యకర్తలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. హక్కుల సాధనకు ఇవాళ మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టరేట్ కార్యాలయ ముట్టడిలో భాగంగా అక్కికిడి వెళ్లనున్న ఆశాలను ముందస్తు అరెస్ట్ చేసారు. దీంతో ఆశా కార్యకర్తలు పోలీస్ స్టేషన్లో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.
ముందస్తు అరెస్ట్‌లతో ఉద్యమాలను ఆపలేరని హెచ్చరించారు. అదేవిధంగా కలెక్టరేట్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేసిన ఆశా కార్యకర్తలను అరెస్ట్ చేసి శామీర్ పేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ కార్యక్రమంలో సీఐటియూ మండల కార్యదర్శి కిష్టప్ప, ఉన్ని కృష్ణా, ఆశా కార్యకర్తలు ప్రమీల, లలిత, మాధవి, కవిత, పద్మ, బాలమణి, శమంత తదితరులు పాల్గొన్నారు.