అల్వాల్ డిసెంబర్ 22 : సమగ్ర కుటుంబ సర్వే చేసిన ఆశాలకు పారితోషికం వెంటనే విడుదల చేయాలని ఆశ వర్కర్ల డిమాండ్ చేశారు. సోమవారం అల్వాల్ మున్సిపల్ కార్యాలయం ప్రజావాణిలో ఏఎంసీకి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమగ్ర కుటుంబ సర్వేలో విధులు నిర్వహించిన ఎన్యూమరేటర్లకు డేటా ఎంట్రీ చేసిన ఆపరేటర్లకు ఇవ్వాల్సిన పారితోషికం వెంటనే ఇవ్వాలని పేర్కొన్నారు.
ఇప్పటి వరకు డబ్బులు చెల్లించకపోవడంతో ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఆశ వర్కర్లు రజిత,జ్యోతి,కళ్యాణి,స్వస్న,మంజుల తదితరులు పాల్గొన్నారు.