దుండిగల్ :దుండిగల్ మున్సిపాలిటీ పరిధిలోని మర్రిలక్ష్మణ్ రెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఎల్ఆర్ఐటీ) కళాశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆర్టీఫీషీయల్ ఇంటలీజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ల్యాబ్‌ను వర్చుసా సీనియర్ డైరెక్టర్ బొల్లంపల్లి బాపినీడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విద్యార్థులకు అందించాలనే ఉద్దేశ్యంతో ఎంఎల్ఆర్ఐటీ కళాశాల యాజమాన్యం ఈ ల్యాబ్‌ను ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు.
ఫలితంగా విద్యార్థులు నూతన ఆవిష్కరణలు చేయడానికి అవకాశం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ మర్రి లక్ష్మణ్ రెడ్డి, ప్రిన్సిపల్ డా.కే.శ్రీనివాసరావు, డా.మధురవాణీ, డా.చంద్రశేఖర్‌రెడ్డి, డా.రాజశేఖర్‌రెడ్డి, రవిచంద్ర, సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.