AI Technology | కేపీహెచ్బీ కాలనీ, ఏప్రిల్ 3 : కృత్రిమ మేధస్సును ఉపయోగించి సమాజానికి ఉపయోగపడే ఆవిష్కరణలు రూపొందించాలని జేఎన్టీయూహెచ్ వైస్ ఛాన్సలర్ టీ కిషన్ కుమార్ రెడ్డి అన్నారు. ఇవాళ జేఎన్టీయూహెచ్ ఐటీ విభాగంలో స్పిరిట్ 2025లో భాగంగా నిర్వహించిన జనరేటివ్ ఏఐ వర్క్ షాప్ను వైస్ ఛాన్సలర్ కిషన్ కుమార్ రెడ్డి, రిజిస్ట్రార్ వెంకటేశ్వరరావు, కళాశాల ప్రిన్సిపల్ జీవీ నరసింహారెడ్డిలు ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆధునిక ప్రపంచంలో కృత్రిమ మేధస్సును ప్రతీ రంగంలో ఉపయోగించి అద్భుతమైన ప్రగతిని సాధిస్తుందన్నారు. విద్య, ఉపాధి, వ్యాపార పరంగా ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన అవకాశాలు ఉన్నాయన్నారు. విద్యార్థులు గతంలో జరిగిన పరిశోధనలోని లోపాలపై.. నూతన ఆవిష్కరణల కోసం బలమైన లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి ఇష్టంతో చదువుకోవాలన్నారు.
ప్రకృతికి అనుగుణంగా ముందుకు సాగాలని.. నూతన పరిశోధనలు చేసి ఉన్నత శిఖరాలు అధిరోహించాలన్నారు. ఈ కార్యక్రమంలో విభాగాధిపతి ఉమారాణి, అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు.
Pooja Hegde | శ్రీకాళహస్తీ రాహుకేతు పూజలో పాల్గొన్న పూజా హెగ్డే
A Raja: బొట్టు పెట్టుకోవద్దు.. కంకణం కట్టుకోవద్దు.. డీఎంకే నేత ఏ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు