Army Women Degree College | ఘట్ కేసర్, జూన్ 11: తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఆర్మీ మహిళా డిగ్రీ కళాశాలలో అడ్మిషన్లు ప్రారంభం అయ్యాయి. ఈ నేపథ్యంలో అర్హులైన అభ్యర్థులు ఈ నెల 23లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కే శ్రీలత తెలిపారు. ఘట్ కేసర్ మున్సిపల్ అంకుషాపూర్లోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఆర్మీ మహిళా డిగ్రీ కళాశాలలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. 2025-26 విద్యా సంవత్సరానికిగాను అర్హులైన మహిళ అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.
ఇంటర్ ద్వితీయ సంవత్సరం 2025లో ఉత్తీర్ణులైన అభ్యర్థులు వారి దరఖాస్తులను ఈ నెల 23వ తేదీలోగా కళాశాలలో నేరుగా సమర్పించవచ్చని చెప్పారు. దరఖాస్తు చేసుకోవడానికి పదవ తరగతి మార్కుల మెమో, ఇంటర్ మార్కుల మెమో, టీసీ, బోనఫైడ్, ఆధార్ కార్డ్, ఆదాయ ధ్రువీకరణ, కుల ధ్రువీకరణ పత్రాలతోపాటు 5 పాస్ పోర్ట్ సైజు ఫోటోలు కళాశాలలో సమర్పించాలన్నారు.
ఈ కళాశాలలో ఎంపీసీ, ఎంఎస్సీఎస్, ఎంజెడ్సీ, బిఏ, బీకాం, సీఏ గ్రూపులు ఉన్నాయని తెలిపారు. డిగ్రీతోపాటు కళాశాలలో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, యూపీఎస్సీ కోచింగ్ వంటి అదనపు ప్రత్యేకతలు ఉంటాయని తెలిపారు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏవైనా సందేహాలు ఉంటే ఫోన్ నెంబర్లు 79950 10687, 79811 99283 లను సంప్రదించాలని కోరారు. ఈ సందర్భంగా అడ్మిషన్ల వాల్ పోస్టర్ ఆవిష్కరించారు.
‘అశుద్ధ’ జలం..! గాగిళ్లాపూర్లో కలుషితమవుతున్న తాగునీరు
UPI Payments | రూ.3వేలు దాటిన యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు..?
BRK Bhavan | తెలుగు తల్లి ఫ్లై ఓవర్పై ఫొటో జర్నలిస్టులను అడ్డుకున్న పోలీసులు