రఫ్ నోట్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్న ద్విభాషా చిత్రం ‘గాడ్స్ అండ్ సోల్జర్స్’. ఆరి అరుజునన్, రాజ్‌తరుణ్, భరత్, అమూ అభిరామి, కిశోర్ ఇందులో ప్రధాన పాత్రధారులు. సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం చిత్రీకరణ పూర్తి చేసుకున్నది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నిమగ్నమైంది. వాస్తవిక సంఘటనలతో వాణిజ్య అంశాల మేళవింపుగా ఈ సినిమా రూపొందుతున్నదని, ఈ సినిమాకోసం అందరూ ప్రాణం పెట్టి పనిచేశారని, కథాపరంగా, సాంకేతికంగా ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతిని పంచే సినిమా ఇదని, త్వరలోనే టీజర్‌ని విడుదల చేయనున్నామని, సినిమా విడుదల తేదీని త్వరలో తెలియజేస్తామని మేకర్స్ చెప్పారు.