ప్రభుత్వం కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేయకపోవడానికి నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం కందుకూరు ఆర్డీవో కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మన్నే జయేందర్ ముదిరాజ్ తెలిపారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సురుసాని సురేందర్‌రెడ్డి, పీఏసీఎస్ మాజీ చైర్మన్ దేవరశెట్టి చంద్రశేఖర్, సీనియర్ నాయకులు గంగాపురం లక్ష్మీనర్సింహరెడ్డి, దశరధ ముదిరాజ్, సామ మహేందర్‌రెడ్డి, మహిళా అధ్యక్షురాలు తాండ్ర ఇందిరమ్మ దేవేందర్, మాజీ డైరెక్టర్ సామ ప్రకాశ్‌రెడ్డి, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ లేమూరు గ్రామ సర్పంచ్ మేఘనాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
-కందుకూరు, ఫిబ్రవరి 21