కుత్బుల్లాపూర్ : సురారం పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్లో సందీప్(21) అనే యువకుడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. సందీప్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అయితే సదరు అమ్మాయితో ప్రేమ విఫలం కావడంతో మనస్తాపానికి గురై రూం లో సీలింగ్ ఫ్యాన్‌కి ఊరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది.
గమనించిన స్థానికులు పోలీసుకులు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.