హైదరాబాద్ : ఓ వ్యక్తిని గొడ్డలితో దారుణంగా నరికి చంపిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఈ సంఘటన మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని గౌడవెల్లిలో గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన లక్ష్మారెడ్డి(42)ను లింగం అనే వ్యక్తి గొడ్డలితో నరికి హతమార్చాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ప్రభుత్వ దవాఖానకు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, లక్ష్మారెడ్డి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. హత్యకు గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.