Illegal construction | దుండిగల్, జూలై 13: మునిసిపాలిటీ నుంచి ఎటువంటి అనుమతులు లేవనే కారణంతో దుండిగల్ మున్సిపల్ సిబ్బంది, అధికారులు శుక్రవారం రాత్రి బౌరంపేటలోని సింహపురి కాలనీలో ఓ భారీ షెడ్డును కూల్చివేశారు. అయితే 12 గంటలు గడిచిందో లేదో నిర్మాణదారుడు అధికారులకు సవాలు విసురుతూ తిరిగి పనులు మొదలుపెట్టడం స్థానికులను విస్మయానికి గురిచేసింది.
కనీసం అధికారులు చర్యలు చేపట్టి 24 గంటలు కూడా గడవక ముందే తిరిగి నిర్మాణ పనులు ఎలా చేపడుతాడంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. నిర్మాణదారుడు వరుసగా వచ్చిన సెలవులను సద్వినియోగం చేసుకునే పనిలో తిరిగి నిర్మాణ పనులు మొదలుపెట్టారా…? లేక నన్ను ఎవరు ఏం చేయలేరు ధైర్యంతో పనులు చేస్తున్నారా…? లేదా నామమాత్రంగా చర్యలు తీసుకున్న అధికారుల పర్యవేక్షణా లోపమా…? నిర్మాణదారుడితో కుమ్మక్కయ్యా రా…? అనే అనుమానాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు.
సీడీఎంఏ అధికారులైన స్పందించి అక్రమ నిర్మాణాలు నిలిపివేయాలని స్థానికులు కోరుతున్నారు.
Siddipet | సాగు నీటి కోసం.. ఆశగా రైతుల ఎదరుచూపులు
Army Jawan Donate | ఆర్మీ జవాన్ ఆదర్శం.. మొదటి వేతనం ఆలయానికి అందజేత
BRS | బీఆర్ఎస్ హాయంలోనే గ్రామపంచాయతీల అభివృద్ధి :ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి