లాభాల బంతి.. పెట్టుబడి తక్కువ.. ఆదాయం ఎక్కువ
బంతి సాగుతో అధిక లాభాలు పొందవచ్చని ఉద్యానవన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఏడాది పొడవునా సాగు చేసి సిరులు పండించవచ్చు. చీడ పీడల నుంచి పంటను కాపాడుకుంటే అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది
- ఏడాది పొడవునా దిగుబడి
- చీడ పీడలు సోకకుండా జాగ్రత్తలు పాటించాలి
- ప్రతి పండుగ, శుభకార్యాలకు బంతి పూలకు గిరాకీ
- తక్కువ నీటి వినియోగంతో బంతి సాగు
- ప్రణాళికాబద్ధంగా సాగు చేసుకోవాలంటున్న ఉద్యానవన శాఖ అధికారులు
మొయినాబాద్, అక్టోబర్ 7 : బంతి సాగుతో అధిక లాభాలు పొందవచ్చని ఉద్యానవన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఏడాది పొడవునా సాగు చేసి సిరులు పండించవచ్చు. చీడ పీడల నుంచి పంటను కాపాడుకుంటే అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది. వినాయక చవితి మొదలుకుని బతుకమ్మ, దసరా, దీపావళి, కార్తీకమాసం ప్రత్యేక పూజల కోసం బంతి పూలను విరివిగా ఉపయోగిస్తారు. బంతి సాగు తక్కువ కాలంలో, తక్కువ ఖర్చుతో పంట చేతికొస్తుంది. ఉగాది పండుగ చివరి వరకు బంతి పంట దిగుబడి వచ్చేలా ప్రణాళికాబద్ధంగా సాగు చేసుకోవాలని అధికారులు చెబుతున్నారు.
సూచనలు, సలహాలు..
- కాలానుగుణంగా బంతి పెరుగుదల కనిపిస్తుంది. వర్షాకాలం మొక్కలు త్వరగా పెరిగి పూతకు వస్తాయి శీతాకాలం ఆ స్థాయిలో పెరుగుదల కనిపించదు. వేసవికి ముందు మొక్కలు బాగా పెరుగుతాయి. కానీ దిగుబడి తక్కువస్తుంది.
- బంతినారు పెరుగుదల 20-25 రోజులు, నాటిన 45-50 రోజులకు మొక్కలు పూతకు వస్తాయి. పూత నుంచి 30-35 రోజుల వరకు చివరి పూత పూర్తవుతుంది. దీని ఆధారంగా రైతులు పంట ప్రణాళిక చేసుకోవాలి.
- బంతి సాగులో కత్తిరింపులు, సూక్ష్మపోషకాల వినియోగం, సస్యరక్షణ చర్యలు అధిక దిగుబడి సాధించడానికి చాలా కీలకం.
కత్తిరింపులు ఎప్పుడు చేయాలి..
- మొక్కలకు సాధారణంగా 20-25 సెం.మీ ఎత్తు పెరిగిన తర్వాత తలలు తుంచాలి. దీని వల్ల పక్క కొమ్మలు ఎక్కువగా వస్తాయి. మొదట సంక్రమణ విత్తనం(ఎఫ్, హైబ్రిడ్ సీడ్స్)కి కత్తిరింపులు అవసరం లేదు.
- సాధారణంగా మొక్కలు పెరిగిన తర్వాత నాటిన 25-30 రోజులకు సూక్ష్మ పోషకాలు అవసరం. అప్పుడు ఫార్ములా 4ని 2.5 గ్రాములు, లీటరు నీటిలో కలిపి 10-12 రోజులకోసారి పిచికారీ చేయాలి.
పూల కోత..
- l బంతి పూలు బాగా విచ్చుకున్న తర్వాత కోయాలి. కోతకు ముందు రోజు తడి వచ్చి పూలు కోయడం వల్ల పూలు ఎక్కువ కాలం తాజాగా నిల్వ ఉంటాయి. పూలను ఉదయం లేదా సాయంత్రం సమయంలో కోయాలి.
- పంట కాలంలో 4-5 సార్లు పూల కోతలు ఉంటాయి. సకాలంలో పూల కోతలు చేస్తే ఎకరాకు 7-8 టన్నుల పూల దిగుబడి రావచ్చు.
- పూల నాణ్యత చెడకుండా తొడిమ ఒకటిన్నర అంగుళాల పొడవులో కోయాలి. దీని వల్ల నాణ్యత బాగుంటుంది.
సమగ్ర సస్యరక్షణ చర్యలు..
- పొడి వాతావరణ పరిస్థితిల్లో తామర పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మొగ్గలు గోధుమ రంగుకి మారి ఎండిపోతాయి. నివారణకు ప్రిఫోనిల్ 1.5 మి.లీ. లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.
- మొగ్గ తొలిచే పురుగును గమనిస్తే ఫెన్వలరేట్ లీటరు నీటికి 2 ఎం.ఎల్ లేదా కరాటే 2.5 ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి
- వర్షాకాలం ఆరంభంలో నాటిన మొక్కలకు ఆకుపచ్చ తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. ఆకులపై నల్లని మచ్చలు వచ్చి త్వరగా రాలిపోతాయి. దీని నివారణకు మెనోమిల్ 2 గ్రాముల్లో లీటరు నీటిని కలిపి పిచికారీ చేయాలి.
తక్కువ నీటితో మొక్కల సంరక్షణ..
ఈ పంటకు నీరు అంతగా అవసరం ఉండదు. వారానికి ఒక సారి నీటిని పెడితే సరిపోతుంది. నీటి యాజమాన్యానికి డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నిర్వహిస్తే మరింత నీరు ఆదా అవుతుంది. మొక్కలు హైబ్రీడ్ రకాలు రావడంతో.. తెగులు, రోగాలు సోకే అవకాశం ఉంటుంది. ఆకు ముడుత పురుగు నివారణ కోసం ఉద్యానవనశాఖ అధికారుల సూచనల మేరకు క్రిమి సంహారక మందులు వాడాలి. సేంద్రియ పద్ధతులైన వేప నూనె పిచికారీ చేస్తే పురుగుల బెడదను తగ్గించవచ్చు. అలాగే మొక్కలకు యూరియా, డీఏపీ వంటి రసాయనిక ఎరువులతో పాటు వేప పిండిని వేస్తే మొక్క ఎదుగుతుంది. మొక్కలు నాటకముందు దుక్కిలోనే సేంద్రియ ఎరువులు వేస్తే రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించవచ్చు.
కాలానికి అనుగుణంగా దిగుబడి..
కాలానికి అనుగుణంగా బంతి పూల దిగుబడి వస్తుంది. వర్షాకాలంలో మొక్కలు త్వరగా పెరిగి , తర్వగా పూతకు వస్తాయి. శీతాకాలంలో పెరుగుదల కనిపించదు. అయినా త్వరగా పూతకు వస్తాయి. వేసవికి ముందు మొక్కల్లో పెరుగుదల కనిపిస్తుంది. పూల దిగుబడిలో నాణ్యత లోపిస్తుంది. ఏడాది పొడవునా బంతి సాగు చేయవచ్చు.
– ఎన్.రాగమ్మ, మండల వ్యవసాయ అధికారి, మొయినాబాద్
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్పై కాల్పులు.. సల్మాన్ ఖాన్తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

