తక్కువ వ్యవధిలో బంతిపూల సాగు అధిక లాభాలనిస్తున్నది. పండుగల సీజన్లలో డిమాండ్ ఉండే ఈ పూల సాగువైపు రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. జూలై మొదటి వారంలో నారు పోస్తే సెప్టెంబర్ నుంచి పంట చేతికి వస్తుంది.
సాంప్రదాయ పంటలు సాగు చేస్తూ నష్టాల ఊబిలో చిక్కుకున్న రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం నూతన ఒరవడికి శ్రీకారం చుట్టింది. అప్పుల పాలు కాకుండా ఉండేందుకు పంట మార్పిడి చేసుకొని పలురకాల ఆదాయానిచ్చే పంటల సాగుపై
బంతి సాగుతో అధిక లాభాలు పొందవచ్చని ఉద్యానవన శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఏడాది పొడవునా సాగు చేసి సిరులు పండించవచ్చు. చీడ పీడల నుంచి పంటను కాపాడుకుంటే అధిక దిగుబడి వచ్చే అవకాశం ఉంటుంది