బంతిపూల సాగు రైతులకు లాభాల పంట పండిస్తున్నది. పండుగల సీజన్లలో ఆర్థికంగా కలిసివస్తున్నది. జూలై మొదటివారం నుంచి సాగు చేస్తే పూలకు బతుకమ్మ, దసరా, దీపావళి, కార్తీకపౌర్ణమి పండుగ సందర్భాల్లో గిరాకీ బాగుంటున్నది. మార్కెట్లో కిలో బంతిపూలు రూ.100 నుంచి రూ.120దాకా అమ్ముడవుతున్నాయి.
– డోర్నకల్, అక్టోబర్ 13
తక్కువ వ్యవధిలో బంతిపూల సాగు అధిక లాభాలనిస్తున్నది. పండుగల సీజన్లలో డిమాండ్ ఉండే ఈ పూల సాగువైపు రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. జూలై మొదటి వారంలో నారు పోస్తే సెప్టెంబర్ నుంచి పంట చేతికి వస్తుంది. ఎకరానికి 4-5 టన్నుల దిగుబడి వస్తుంది. ఉదయం లేదా సాయంత్రం మాత్రమే పూలు తెంపితే దిగుబడి బాగుంటుంది. పండుగలతో పాటు వివిధ శుభకార్యాల సందర్భంగా పూలకు మంచి గిరాకీ ఉంటున్నది. మహబూబాబాద్, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లోని పలువురు రైతులు బంతిపూల సాగు చేస్తూ సీజన్లో లాభాలు పొందుతున్నారు. ర్థికంగా కలిసివస్తున్నది. జూలై మొదటివారం నుంచి సాగు చేస్తే పూలకు బతుకమ్మ, దసరా, దీపావళి, కార్తీకపౌర్ణమి పండుగ సందర్భాల్లో గిరాకీ బాగుంటున్నది. మార్కెట్లో కిలో బంతిపూలు రూ.100 నుంచి రూ.120దాకా అమ్ముడవుతున్నాయి.
– డోర్నకల్, అక్టోబర్ 13
పదేళ్ల నుంచి సాగు చేస్తున్నా
నేను పదేళ్ల నుంచి బంతి తోట సాగు చేస్తున్నా. మంచి లాభాలు వస్తున్నాయి. బతుకమ్మ, దసరా, దీపావళి, కార్తీకపౌర్ణమి పండుగలకు, శుభకార్యాలకు బంతి పూల విక్రయాలు బాగుంటున్నాయి. తోటవద్దే పూలు అమ్మితే అటు రైతులకు, ఇటు వినియోగదారులకు లాభం ఉంటుంది.
-వెన్నబోయిన నాగేశ్వరావు, రైతు, డోర్నకల్
120 రోజుల్లో సాగు
బంతి సాగు 120 (నాలుగు నెలలు) రోజుల్లోనే పూర్తవుతుంది. పండుగల సీజన్‌కు తగ్గట్లుగా బంతి పూలు సాగు చేసుకోవాలి. ఉద్యాన వన శాఖ తరఫున బంతిపూల సాగును ప్రోత్సహించి, రైతులకు సలహాలు సూచనలు అందిస్తున్నాం. బంతి పూల మార్కెటింగ్ బాగుంటుంది. తక్కువ సమయంలో రైతులకు ఎక్కువ లాభాలనిచ్చే పంట ఇది. పెట్టుబడి కూడా చాలా తక్కువ అవుతుంది.
-అనిత శ్రీ, ఉద్యాన శాఖ మండల అధికారి, డోర్నకల్