షాద్‌నగర్‌రూరల్,డిసెంబర్15 : బీఅర్ఎస్తోనే గ్రామాలు, తండాలలో ప్రగతి వెలుగులు నిండుతాయని మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలంలోని ఎలికట్ట గ్రామంలో ఇటివల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలల్లో వార్డు సభ్యులుగా గెలుపొందిన సులోచన, కళమ్మ, కవిత సోమవారం మాజీ ఎంపీపీ బెంది శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఅర్ఎస్లోకి చేరారు. ఈ సందర్భంగా వార్డు సభ్యులతో పాటు ఎలికట్ట అంబభవానీదేవాలయా చైర్మన్ ముత్యాల రాజు, హనుమాన్ దేవాలయా చైర్మన్ నారం దినేష్‌రెడ్డి, ఇతర నాయకులను మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ బీఅర్ఎస్ కండువాలను కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం అయన మాట్లాడుతూ..గ్రామాలు, తండాలు కనీవినీ ఎరగనీ రీతిలో అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీ అని స్పష్టం చేశారు. మారుమూల గ్రామీణ ప్రాంతాలు, గ్రామాలు,తండాల అభివృద్దికి ఎన్నో సంక్షేమ ఫథకాలను అమలు చేసి అభివృద్ధిని పరిచిన ఘనత బీఅర్ఎస్కే దక్కిందన్నారు. గ్రామపంచాయతీలకు నాడు ప్రత్యేక నిధులను సైతం కేటాయించిందన్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయిన గ్రామపంచాయతీల అభివృద్దికి సరిపడా నిధులను మంజూరు చేయకపోవడం కాంగ్రెస్ పాలన నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీఅర్ఎస్ పార్టీ విజయం సాధించడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్ నాయక్, మాజీ మున్సిపల్ చైర్మన్ నరేందర్, మాజీ సర్పంచ్ సాయిప్రసాద్, నాయకులు పాల్గొన్నారు.