తుర్కయాంజాల్, సెప్టెంబర్ 23 : బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసులకు భయపడే ప్రసక్తే లేదని ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. కాంగ్రెస్ నాయకులు అక్రమంగా కేసు లు పెట్టి జైలుకు పంపించిన బీఆర్ఎస్ నాయకుడు మురళీధర్‌రెడ్డిని మంగళవారం ఇంజాపూర్‌లోని ఆయ న నివాసంలో కిషన్‌రెడ్డి కలిసి పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలపై కాంగ్రెస్ ప్రభు త్వం పెడుతున్న కేసులకు భయపడబోమని చట్టప్రకారం ఎదుర్కొంటామన్నారు. శ్రేణులు ఎవ రూ అధైర్యపడొద్దని పార్టీ అండగా ఉంటుందన్నా రు. వాట్సాప్‌లో సాధారణంగా పెట్టిన పోస్టును రాజకీయం చేసి మురళీధర్‌రెడ్డిపై అక్రమ కేసులు బనాయించడంపై మండిపడ్డారు. అధికారం ఉం దని ఇష్టానుసారంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ప్రజాక్షేత్రంలో ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యేకు సెగ్మెంట్ అభివృద్ధిపై అసలు ధ్యాసే లేదని.. కేవలం వసూళ్లపైనే ఉందని ఎద్దేవా చేశా రు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో రూ.63 కోట్ల పనులను ఆర్‌అండ్‌బీకి అప్పజెప్పి రోడ్ల అంచనా వ్యయాన్ని సుమారు 30 శాతం పెంచి ఎలాంటి లెస్ లేకుండా తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు పనులను అప్పజెప్పి ప్రభుత్వ ధనాన్ని లూటీ చేస్తున్నారని ఆరోపించారు. మునగనూర్‌లో సుమారు 12 ఎకరాల ప్రభు త్వ స్థలాన్ని కాజేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు.
కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు వంగేటి లక్ష్మారెడ్డి, గ్రంథాల య సంస్థ జిల్లా మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, మాజీ కౌన్సిలర్లు కల్యాణ్‌నాయక్, మల్లేశ్, సీనియర్ నాయకులు చంద్రశేఖర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, సంజీవరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, అశోక్, చిన్నయ్య, ధశరథ, సంపతీశ్వర్రెడ్డి, ఆనంద్‌రెడ్డి, గౌతమ్‌రెడ్డి, శ్రీనివాస్, రాజిరెడ్డి, సామ అమేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.