మంచాల, ఫిబ్రవరి 6 : రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతున్నదని బీఆర్ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. గురువారం పార్టీ మండలాధ్యక్షుడు చీరాల రమేశ్ అధ్యక్షతన జరిగిన విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సమస్యలను ప్రభుత్వానికి విన్నవించాలంటే పోలీసులతో అరెస్టు చేయించడమే కాకుండా రైతులపై దాడులూ చేస్తున్నారని ఆరోపించారు.
ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో 15 ఏండ్లుగా తాను చేసిన అభివృద్ధి పనులనే నేడు కాంగ్రెస్ ఎమ్మెల్యే రంగారెడ్డి శిలాఫలకాల పేరుతో మళ్లీ ప్రారంభిస్తున్నారన్నారు. మంచాల మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో కూడా ఆయనకు తెలియవని, ఇప్పటివరకు ఒక్క రూపాయీ విదల్చలేదని ఎద్దేవా చేశారు. ఈ నెల 10లోపు గ్రామస్థాయిలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశాల ను పూర్తి చేసుకోవాలని శ్రేణులకు పిలుపునిచ్చా రు.
గతంలో కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను నేరుగా అందించేవారమని, కానీ, నేడు కాం గ్రెస్ నాయకులు చెక్కుల పేరుతో గ్రామాల్లో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. రైతాంగాన్ని మోసం చేసిన ఘనత రేవంత్‌రెడ్డికే దక్కిందని ఎద్దే వా చేశారు. హామీల అమల్లో పూర్తిగా విఫలమయ్యారన్నారు. నియోజకవర్గ అభివృద్ధికి పనిచేసే నాయకుడిని ఎవరూ మరిచిపోలేదని, ఏ గ్రామానికెళ్లినా ప్రజలు ఆప్యాయంగా పలుకరిస్తున్నారని, తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే బాగుండే అని చెప్తున్నారన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందన్నారు. అనంతరం బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు క్యామ మల్లేశ్ మాట్లాడుతూ.. 14 నెలల పాలనలో కాంగ్రెస్ ప్ర జలకు తీవ్ర అన్యాయం చేసిందని మండిపడ్డారు. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ప్రతి కార్యకర్త సిద్ధ మై బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు. సమావేశంలో గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ సత్తు వెంకటరమణారెడ్డి, మా ర్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఏర్పుల చంద్రయ్య, బీఆర్ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బహుదూర్, సహకార సంఘం వైస్ చైర్మన్ యాద య్య, బీఆర్ఎస్ నాయకులు రాంరెడ్డి, కిషన్‌రెడ్డి, వెంకటేశ్‌గౌడ్, జానీపాషా, సుకన్య, బద్రీనాథ్గుప్తా పాల్గొన్నారు.