షాద్‌నగర్‌రూరల్, ఏప్రిల్ 11 : తెలంగాణ ప్రజల అభ్యున్నతి, సంక్షేమం కోసం రాష్ర్టంలో సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలే పార్టీకి శ్రీరామ రక్షగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. షాద్‌నగర్‌లోని బీఅర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఫరూఖ్‌నగర్ మండలంలోని కమ్మదనం, చింతగూడెం గ్రామాలకు చెందిన బీజేపీ, పలు పార్టీలకు చెందిన యువకులు, నాయకులు బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. వారికి ఎమ్మెల్యే పార్టీ కండువాలను కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ సర్కారు అన్ని వర్గాల ప్రజల కోసం అహర్నిశలు కృషిచేస్తున్నదన్నారు. బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను పలు రాష్ర్టాలు అమలు చేస్తున్నాయన్నారు. మన సంక్షేమ పథకాలే దేశానికి దిక్సూచిలా మారడం గర్వించదగ్గ విషయమన్నారు. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చిల్లర రాజకీయం చేస్తున్నారన్నారు. వారిని దేశం మొత్తం గమనిస్తున్నదని.. రానున్న ఎన్నికల్లో వారికి ఓటుతో బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. కమ్మదనం గ్రామానికి చెందిన బీజేపి నాయకులు వల్కే శ్రీకాంత్, నర్సింహులు, చిన్నారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, బల్వంత్, రవి, శ్రీకాంత్, వెంకటేశ్, మురళి, మదన్, వంశీ, శేఖర్, హరీశ్, శివ, భాస్కర్, చింతగూడ గ్రామానికి చెందిన అనిల్‌కుమార్, కల్యాణ్, శ్రీకాంత్, ఉపేందర్, దశరథ్, సాయి, బాలరాజ్, శివకుమార్, బాలశంకర్, సునీల్, శివ, భరత్, వినయ్, వెంకటయ్య బీఆర్ఎస్ పార్టీలోకి చేరారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్, కమ్మదనం సర్పంచ్ నర్సింహులు, పార్టీ మండల అధ్యక్షుడు లక్ష్మణ్‌నాయక్, నాయకులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరిన అప్పారెడ్డిగూడ కాంగ్రెస్ నాయకులు
రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. నందిగామ మండలం అప్పారెడ్డిగూడ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం సర్పంచ్ నర్సింహులు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్‌తో కలిసి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికీ తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. పార్టీలో చేరిన వారిలో పెద్ద మల్లయ్య, ప్రశాంత్, దుబ్బ మల్లేశ్, జగయ్య, వసంత్, నర్సింహులు, మణికంఠ, రాజు, శంకర్, మహేశ్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు సత్యనారాయణ, రాంబల్‌నాయక్, శ్రీశైలం, పెంటయ్య, నర్సింహ, కృష్ణ, లింగం పాల్గొన్నారు.