నిండుతున్న చెరువులు, ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, చెరువులు
హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు, ప్రజలు
కోట్పల్లి/ధారూరు, జూలై 14 : వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కోట్పల్లి మండలంలోని కోట్పల్లి వాగు, నాగసాన్పల్లి చెరువు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి.
ధారూరు మండలపరిధిలోని కోట్పల్లి ప్రాజెక్టులోని భారీగా వరదనీరు వచ్చి చేరింది. ప్రాజెక్టు నుంచి అలుగు పారుతున్నది. ప్రాజెక్టులోకి ఎవరూ వెళ్లకుండా కర్రలను ఏర్పాటు చేశారు. పర్యాటకులు జాగ్రత్తలు పాటించాలని సంబంధిత అధికారులు హెచ్చరిస్తున్నారు.
కోట్పల్లి : అలుగుపారుతున్న నాగసాన్పల్లి చెరువు