సమాధానం లభించక పనులు పూర్తికాక..
ప్రజాపాలన అంటూ గొప్పలు చెప్పుకొంటున్న కాంగ్రెస్ పాలనలో క్షేత్రస్థాయిలో మాత్రం దారుణంగా ఉన్నదన్నా ఆరోపణలున్నాయి. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక 99 రోజుల పేరుతో హంగామా చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- ప్రభుత్వ కార్యాలయాల్లో కొరవడిన జవాబుదారీతనం
రంగారెడ్డి, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ) : ప్రజాపాలన అంటూ గొప్పలు చెప్పుకొంటున్న కాంగ్రెస్ పాలనలో క్షేత్రస్థాయిలో మాత్రం దారుణంగా ఉన్నదన్నా ఆరోపణలున్నాయి. ప్రజాపాలన.. ప్రగతి ప్రణాళిక 99 రోజుల పేరుతో హంగామా చేస్తున్నా ఆశించిన స్థాయిలో ఫలితం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని ముఖ్యమైన శాఖల్లో ప్రజలకు సరైన సమాధానం లభించకపోగా.. పనులు కూడా సకాలంలో జరగడంలేదని సర్కార్ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పరిధిలో 21 గ్రామీణ మండలాలున్నాయి. వాటిలో భూసమస్యలతోపాటు ఇందిరమ్మ ఇండ్లు, పింఛన్లు, రేషన్కార్డులు, ప్రభుత్వ పథకాల కోసం ప్రజలు పెద్ద ఎత్తున ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. అధికారులు అం దుబాటులో లేకపోవటంతో నిరాశతో వెనుతిరుగుతున్నా రు. సార్.. మేడమ్ ఫీల్డ్ విజిట్లో ఉన్నారని అటెండర్లు అక్కడి చెబుతుండడంతో చేసేదేమీలేక ప్రజలు రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన దుస్థితి నెలకొన్నది.
భూభారతి సమస్యలకు దారి చూపని అధికారులు
జిల్లాలో భూసమస్యలు అధికంగా ఉన్నాయి. వీటి పరిష్కారానికి ప్రజలు పెద్ద ఎత్తున రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ధరణి స్థానంలో భూభారతి తీసుకొచ్చి గ్రామాల్లో రెవె న్యూ సదస్సులనూ నిర్వహించింది. ఈ సదస్సుల్లో జిల్లాలో దాదాపుగా 20,000 పైగా రెవెన్యూపరమైన ఫిర్యాదులొచ్చా యి. ఇటీవల మరో 10,000 వరకు ఆ సమస్యలపైనే ఫిర్యాదులు వచ్చినట్టు సమాచారం. వాటిలో చేవెళ్ల డివిజన్లో 1,07,000, ఇబ్రహీంపట్నం డివిజన్లో 88 వేలు, కందుకూరు డివిజన్లో 92వే లు, రాజేంద్రనగర్ డివిజన్లో 39వేలు, షాద్నగర్ డివిజన్లో 57వేల పైచిలుకు ఫిర్యాదులొచ్చాయి. వీటిలో సగానికి పైగా కూడా సమస్యలు పరిష్కారానికి నోచుకోలేదు. పరిష్కారం కాని సమస్యల కోసం రైతులు ప్రతిరోజూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నా రు. సంబంధిత అధికారులు అందుబాటులో ఉండకపోవడంతో ప్రజలకు ఇబ్బందులు తప్పటంలేదు.
వేధిస్తున్న టీపీవోల కొరత..
ప్రజలకు ముఖ్యమైన శాఖల్లో మున్సిపల్ శాఖ కూడా ఒకటి. ఈ శాఖలో కీలకమైన టీపీవోలు లేకపోవటంతో ప్రజలు తమ సమస్యల కోసం కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఒక్కో టీపీవోకు మూడు నుంచి నాలుగు మున్సిపాలిటీలకు అదనపు బాధ్యతలు ఉండడంతో వారు ఏ రోజు ఎక్కడ ఉంటున్నారో తెలియటంలేదు. కార్యాలయాలకెళ్తే కిందిస్థాయి సిబ్బంది వారి జాడ చెప్పటంలేదు. జిల్లా లో ఆరు మున్సిపాలిటీలుండగా.. వాటికి పర్మినెంట్ టీపీవోలు లేరు. ఈ ఆరు మున్సిపాలిటీలకు టీపీవోలుగా ఇతర జిల్లాలకు చెందిన వారు ఇన్చార్జీలుగా వ్యవహరిస్తున్నారు. వీరు అందుబాటులో ఉండకపోవడంతో కిందిస్థాయి సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. టీపీవోలు లేకపోవటంతో భవన నిర్మాణాలు యథేచ్ఛగా ఆరోపణలున్నాయి.
గ్రామాల్లో పడకేసిన పారిశుధ్యం, అందని తాగునీరు..
గ్రామాల్లో ఎక్కడ చూసినా పారిశుధ్యం పడకేసింది. ఎక్కడ చూసినా మురుగు కాల్వలు, చెత్తాచెదారంతో గ్రామాలు దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయి. గత బీఆర్ఎస్ హయాంలో చెత్తసేకరణ కోసం గ్రామానికో ట్రాక్టర్ను అందజేసినా వాటి నిర్వహణపై దృష్టి సారించకపోవడంతో అవి మూలనపడడంతో చెత్తాచెదారం పేరుకుపోయి గ్రామాల్లో పారిశుధ్యం పూర్తిగా పడకేసింది. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులూ తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. అలాగే, వేసవి లో ఎండలు దంచికొడుతున్నందున గ్రామాల్లో ప్రజలకు తాగునీటి సమస్య తీవ్రమైంది. తాగునీటి సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు, ప్రజాప్రతినిధులు చేతులెత్తేశారని ప్రజలు మండిపడుతున్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

