అమరావతి : రోడ్డు ప్రమాద ఘటన నుంచి తనయుడు ఆరవ్‌ను తప్పించేందుకు సాక్ష్యాలు మార్చినట్లు కేసు నమోదై జైలులో ఉన్న వైసీపీ మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ( Seediri Appalaraju ) కు సోంపేట కోర్టు బెయిలు ( Sompeta Court Bail ) మంజూరు చేసింది. గత నెల 22న సీదిరి అప్పలరాజును ఏపీ పోలీసులు అరెస్టు చేసి పలాస కోర్టులో హాజరు పరిచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించింది.
అప్పటి నుంచి జైలులో ఉన్న ఆయనకు బెయిల్ మంజూరు చేయాలని పలుసార్లు పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కోర్టు నిరాకరించింది. చివరకు శుక్రవారం కోర్టు సీదిరికి బెయిల్ మంజూరు చేసింది. సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ బైక్ డ్రైవ్ చేస్తూ గొర్రెల కాపరి దానయ్యను ఢీ కొనడంతో ఆయన మృతి చెందాడు. ఈ కేసు నుంచి తప్పించేందుకు సాక్ష్యాలు మార్చినట్లు ఆరోపణలు రావడంతో అప్పలరాజును పోలీసులు అరెస్టు చేశారు.