Sports School | స్పోర్ట్స్ స్కూల్లో చెత్తాచెదారం.. రోగాల బారిన విద్యార్థులు, మండిపడుతున్న తల్లిదండ్రులు
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం.. పట్టించుకోని అధికారుల తీరు విద్యార్థులకు శాపంగా మారింది. పచ్చని, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యనాభ్యసించాల్సిన విద్యార్థులు పేరుకుపోయిన చెత్త చెదారంతో సావాసం చేస్తున్నారు.
హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 1: కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం.. పట్టించుకోని అధికారుల తీరు విద్యార్థులకు శాపంగా మారింది. పచ్చని, ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యనాభ్యసించాల్సిన విద్యార్థులు పేరుకుపోయిన చెత్త చెదారంతో సావాసం చేస్తున్నారు. క్రీడల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాల్సిన విద్యార్థులు రోగాల బారిన ఇంటికెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులపై తల్లిదండ్రులు మండిపడుతున్నారు. తమ పిల్లలు ఇలాంటి వాతావరణంలో ఉండాల్సి రావడం బాధాకరమని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తూతూమంత్రంగా ఉత్తుత్తి స్పోర్ట్స్ స్కూల్
కాంగ్రెస్ ప్రభుత్వం తూతూమంత్రంగా ఉత్తుత్తి స్పోర్ట్స్ స్కూల్ హనుమకొండ జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ప్రారంభించారు. ఇంకా ఇప్పటివరకు ఎలాంటి జీవో ప్రకటించలేదు.అరకొర వసతులు సమకూర్చి నెట్టుకొస్తున్నారు. రెండేళ్లుగా విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. స్పోర్ట్స్ పాఠశాలలో పారిశుధ్య పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. పాఠశాల పరిసరాల్లో చెత్తాచెదారం పేరుకుపోయి అపరిశుభ్ర వాతావరణం కనిపిస్తోంది. దీంతో పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న విద్యార్థినీ, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విద్యార్థులకు క్రీడలతో పాటు నాణ్యమైన విద్య, ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించాల్సిన పాఠశాల ఆవరణలోనే చెత్త పేరుకుపోవడం పట్ల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పట్టించుకోని అధికారులు..
చెత్త కారణంగా దోమలు, ఈగలు వృద్ధి చెందడంతో పాటు దుర్వాసన వస్తోందని చెబుతున్నారు. అపరిశుభ్రత కారణంగా విద్యార్థులు రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టించుకోవాల్సిన అధికారులు ప్రజాప్రతినిధులు ఎటువైపు కన్నెత్తి చూడడం లేదని తల్లిదండ్రులు మండిపడుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి పాఠశాల ఆవరణలో పేరుకుపోయిన చెత్తను తొలగించి, క్రమం తప్పకుండా పారిశుధ్య చర్యలు చేపట్టాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని స్పోర్ట్స్ పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు శాశ్వత చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sugar | చక్కెరలో ఉండే మూడు రకాలు ఏమిటి.. అవి ఏం చేస్తాయి..?
Assailant | మలక్‌పేట్‌లో మహిళల రూంలోకి ప్రవేశించిన ఆగంతకుడు
KTR | ఇంకో సంవత్సరం మాత్రమే ఉంది.. ఆ తర్వాత కేసీఆర్ వస్తరు : కేటీఆర్
Health tips | అజీర్తి సమస్య అవస్థ పెడుతోందా.. అయితే ఈ చిట్కాలు మీ కోసమే..!
Chemical Blast | కాటేదాన్ బాటిళ్ల తయారీ కంపెనీలో కెమికల్ బ్లాస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

