షాద్‌నగర్, జనవరి 12 : మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జరిగే పార్టీ కార్యకర్తల సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్తున్న మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు షాద్‌నగర్ బైపాస్ రోడ్డులో ఘన స్వాగతం లభించింది. సోమవారం ఉదయం మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ ఆధ్వర్యంలో వందలాది మంది కార్యకర్తలు, నాయకులు కేటీఆర్‌కు స్వాగతం పలికి.. తెలంగాణ నినాదాలు చేశారు. కేటీఆర్ కాన్వాయ్‌పై పూలవర్షం కురిపిస్తూ జై బీఆర్ఎస్, జై కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలిరావడం పట్ల కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. కార్యకర్తలకు అభివాదం చేస్తూ విజయ సంకేతం చూపా రు.
రానున్నది మన ప్రభుత్వమేనని కార్యకర్తల్లో మరింత జోష్ నింపారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నేత రవీందర్‌యాదవ్ మాట్లాడుతూ.. కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి, ప్రగతిని నేటికీ ప్రజలు మర్చిపోలేకపోతున్నారన్నారు. అమలుకు సాధ్యం కానీ హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేస్తున్నదని ఆరోపించారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని ప్రధాన నాయకులు, గ్రామాల సర్పంచ్ లు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.