సెర్ప్ ఉద్యోగుల హర్షం
తెలంగాణ ప్రభుత్వం సెర్ప్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ వేతనాలు పెంచినందుకు షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సమక్షంలో ఎక్లాస్ఖాన్పేటలోని బీఎస్ఆర్ ఫంక్షన్హాల్లో శనివారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం అనంతరం కేశంపేట సెర్ప్ ఉద్యోగులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
- సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం
కేశంపేట, మార్చి 25 : తెలంగాణ ప్రభుత్వం సెర్ప్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ వేతనాలు పెంచినందుకు షాద్నగర్ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ సమక్షంలో ఎక్లాస్ఖాన్పేటలోని బీఎస్ఆర్ ఫంక్షన్హాల్లో శనివారం బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం అనంతరం కేశంపేట సెర్ప్ ఉద్యోగులు సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
రాష్ట్రంలోని 3974 మంది సెర్ప్ ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ జీవో నం.11ను ప్రభుత్వం విడుదల చేయడం చాలా సంతోషమని, చాలా ఏండ్లుగా కాంట్రాక్టు ఉద్యోగులుగా పనిచేస్తున్న తమ కష్టాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ ప్రతిఫలం అందజేశారని ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ను సంఘం నాయకులు సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గణేశ్, జడ్పీటీసీ విశాల, ఏపీఎంలు యాదగిరి, భగవంతు, సీసీలు రాంచంద్రయ్య, మల్లేశ్, జంగయ్య, తిరుపతమ్మ, నర్సింహ, యాదయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Rangareddy News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

