Eye Camp | కేశంపేట, ఏప్రిల్ 12 : మండల పరిధిలోని కొత్తపేట గ్రామంలో కంటి సంబంధ వ్యాధితో బాధపడుతున్న పలువురు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి తరలివెళ్లారు. గ్రామ మాజీ సర్పంచ్ కామ్లెకార్ నవీన్ సమక్షంలో ఎల్వీ ప్రసాద్ దవాఖాన వైద్య సిబ్బంది భాను, కవిత గ్రామంలోని రోగులను దగ్గరుండి శస్త్ర చికిత్సల కోసం తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ మాట్లాడుతూ.. గ్రామంలో ఈ నెల 9న బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి 50 మంది రోగులకు కంటి శస్త్ర చికిత్సలు అవసరమవుతాయని గుర్తించడం జరిగిందన్నారు. అందరికీ శస్త్ర చికిత్సలు చేసి తిరిగి ఇంటిదగ్గర వదిలేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఈ అవకాశాన్ని పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ నరేశ్ యాదవ్, మాజీ వార్డు సభ్యులు జగన్ రెడ్డి, మహేందర్ రెడ్డి, వెంకటేష్, నాయకులు నిర్దవెళ్లి ఆంజనేయులు, భానుచందర్, సాయి, కంటి ఆపరేషన్లకు వెళ్తున్న రోగులు, తదితరులు పాల్గొన్నారు.
Ramakrishna Math | రామకృష్ణ మఠంలో వేసవి శిక్షణా శిబిరాలు
padi koushik reddy | బీఆర్ఎస్ రజతోత్సవ సభను విజయవంతం చేయాలి
Mutton | మటన్‌ను ఎంత మోతాదులో తింటే మంచిది..? ఈ లిమిట్ దాటితే కష్టమే..!