నేను సైతం.. ప్రకృతి పరిరక్షణకు..
అనంతమైన విశ్వంలో జీవం మనుగడ సాగిస్తున్నది ఒక్క ఈ భూగోళంపైనే! మనుషులే కాదు.. జంతువులు, మొక్కలు, అడవులు.. ఇలా సమస్త జీవజాలం ఉండేది ఇక్కడే! అలాంటి జీవవైవిధ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిది. అయితే, మానవ కార్యకలాపాల వల్ల సమస్త జీవరాశి మనుగడకూ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నది. కాలుష్యం, వేట, అడవుల నరికివేత.. అన్నీ కలిసి ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. ఇప్పటికే.. ఎన్నో జాతులు అంతరించిపోయాయి. మరికొన్నిఅంతరించిపోయే దశలో ఉన్నాయి.
మార్చి 3 ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం
అనంతమైన విశ్వంలో జీవం మనుగడ సాగిస్తున్నది ఒక్క ఈ భూగోళంపైనే! మనుషులే కాదు.. జంతువులు, మొక్కలు, అడవులు.. ఇలా సమస్త జీవజాలం ఉండేది ఇక్కడే! అలాంటి జీవవైవిధ్యాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిది. అయితే, మానవ కార్యకలాపాల వల్ల సమస్త జీవరాశి మనుగడకూ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నది. కాలుష్యం, వేట, అడవుల నరికివేత.. అన్నీ కలిసి ప్రకృతి సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. ఇప్పటికే.. ఎన్నో జాతులు అంతరించిపోయాయి. మరికొన్నిఅంతరించిపోయే దశలో ఉన్నాయి. ఈ క్రమంలో ప్రకృతికి రక్షణగా నిలవాల్సిన అవసరం ఉన్నది. అందుకే, ఐక్యరాజ్య సమితి..మార్చి 3న ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవంగా జరుపుతున్నది. ప్రకృతి పట్ల మన బాధ్యతను గుర్తుచేస్తున్నది.
ప్రకృతిని, సమస్త జీవజాలాన్ని కాపాడాలంటే.. జీవశాస్త్రవేత్తలే కావాల్సిన అవసరంలేదు. సామాన్యుడిగా మీరు కూడా జీవవైవిధ్య పరిరక్షణకు పాటుపడొచ్చు. చిన్నదో.. పెద్దదో మీకు తోచిన సాయం చేస్తూ.. జీవవైవిధ్యాన్ని కాపాడుకోవవచ్చు. భవిష్యత్ తరాలకు మరింత ఆరోగ్యకరమైన, స్థిరమైన భూగ్రహాన్ని అందించడంలో సహాయపడవచ్చు.
జీవవైవిధ్యాన్ని కాపాడటానికి వేసే మొదటి అడుగు.. దాని ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడం! వన్యప్రాణులు, వాటి జీవన విధానంపై అవగాహన పెంచుకోండి. స్థానిక జాతులు, వాటి ఆవాసాలు, అవి పోషించే పర్యావరణ పాత్రల గురించి తెలుసుకోండి. మీరు నేర్చుకున్న విషయాలను మీ కుటుంబం, స్నేహితులతో పంచుకోండి. జీవవైవిధ్యంపై మరింత మందికి తెలియజేయడానికి కమ్యూనిటీ వర్క్‌షాప్‌లను నిర్వహించండి. వన్యప్రాణుల గురించి మీరు ఎంతఎక్కువ తెలుసుకుంటే.. వాటి పరిరక్షణ కోసం వాదించడానికి అంత బాగా సన్నద్ధమవుతారు.
వన్యప్రాణులు, వాటి ఆవాసాలను రక్షించడానికి అనేకమంది వ్యక్తులు, సంస్థలు కృషి చేస్తున్నాయి. వాటికి మీ వంతు మద్దతు అందించండి. ఇందుకోసం విరాళాలే ఇవ్వాల్సిన పనిలేదు. స్వచ్ఛందంగా సేవ చేయొచ్చు. ఆయా సంస్థలు చేపట్టే ప్రచారాలలోనూ పాల్గొనవచ్చు. వన్యప్రాణుల వేట, ఆవాసాల నాశనాన్ని నివారించడం, వాతావరణ మార్పులకు వ్యతిరేకంగా చేసే పోరాటంలో మీవంతు పాత్ర పోషించండి.
పర్యావరణ వ్యవస్థలకు గణనీయమైన ముప్పును కలిగిస్తున్నవాటిలో ప్లాస్టిక్ ముందు వరుసలో ఉన్నది. నేలమీది ప్రాణులకే కాదు.. సముద్రపు జీవులకూ ఎనలేని హాని కలిగిస్తున్నది. అందుకే, మొదట మీరు ప్లాస్టిక్ వినియోగించడాన్ని తగ్గించండి. వన్యప్రాణులకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించడానికి కృషిచేయండి. పునర్వినియోగించే బ్యాగులు, కంటైనర్లు, సీసాలను ఉపయోగించండి. సాధ్యమైనప్పుడల్లా రీసైక్లింగ్ కార్యక్రమాల్లో పాల్గొనండి. ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో సహాయపడండి.
ఇంటి వద్దే జీవవైవిధ్యాన్ని పెంచడానికి బాల్కనీల్లో పక్షుల కోసం ఫీడర్లను ఏర్పాటు చేసుకోండి. మిద్దె తోటలు, బాల్కనీల్లోని మొక్కలు కూడా స్థానిక వన్యప్రాణులకు కీలకమైన ఆవాసాలుగా మారుతాయి. తోటలు, బాల్కనీల్లో.. పక్షులు, ఇతర ప్రయోజనకరమైన జీవులను ఆకర్షించే స్థానిక మొక్కలను పెంచండి. పర్యావరణ వ్యవస్థకు హాని కలిగించే పురుగుమందులు, కలుపు మందులను నివారించండి.

Wildlife
ఈ యేడాది థీమ్..
2026 ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం.. ‘ఔషధ-సుగంధ మొక్కలు : ఆరోగ్యం, వారసత్వం, జీవనోపాధిని కాపాడటం’ అనే థీమ్‌తో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా, ఔషధ-సుగంధ మొక్కల సంరక్షణపై ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నారు. సాధారణంగా వన్యప్రాణులు అనగానే జంతువుల గురించే ఆలోచిస్తారు. కానీ అడవుల్లోని వృక్షసంపద, ముఖ్యంగా ఔషధ మొక్కలు మానవ మనుగడకు అత్యంత కీలకం. ఆరోగ్యం మొదలుకొని వ్యాపారం, వారసత్వం.. అన్నిటా ఈ ఔషధ-సుగంధ మొక్కలు ముఖ్యపాత్ర పోషిస్తున్నాయి. మానవ ఆరోగ్యం, శ్రేయస్సుతోపాటు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలోనూ ముందుంటాయి. సంప్రదాయ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలకు పునాదిగా నిలుస్తున్నాయి. ఆధునిక వైద్యానికీ దోహదం చేస్తున్నాయి. ప్రపంచ జనాభాలో సుమారు 80 శాతం మంది ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ కోసం మొక్కల ఆధారిత సంప్రదాయ వైద్యంపైనే ఆధారపడుతున్నారు. ఇక ఆధునిక వైద్యంలోనూ క్యాన్సర్, మలేరియా వంటి వ్యాధుల మందులలో అడవి మొక్కల ఉపయోగం ఎంతో ఉన్నది. ఇవే మన ఆరోగ్యానికి, జీవనానికీ రక్షణ కవచాలు. వాటిని కాపాడుకోవడం అంటే.. మన ఆరోగ్యాన్ని, సంస్కృతినీ కాపాడుకోవడమే!
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
భూ సమస్యలకు త్వరలోనే పరిష్కారం : కలెక్టర్ చంద్రశేఖర్
CJP leaders | మమ్మల్ని అరెస్టు చేసినా ఉద్యమం ఆగదు.. సౌరవ్ దాస్, రాంకా వెల్లడి.. క్రైమ్ బ్రాంచ్ ఎదుట హాజరు
అమెరికాలో భార్యను హత్య చేసిన భారత సంతతి వ్యక్తి.. ఐసీఈ ఏజెంట్లు ఆమెను కిడ్నాప్ చేసినట్లు ఆరోపణ
Rahul Gandhi | రాహుల్ గాంధీ వర్సెస్ ప్రియాంకా గాంధీ.. కాంగ్రెస్‌లో విబేధాలున్నాయంటున్న బీజేపీ
డేగలమడుగులో పత్తి కొనుగోలు కేంద్రం ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

