పరిగి, జూన్ 20 : ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ సర్కారు విఫలమైందని పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పు ల మహేశ్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. రాష్ట్రం లో పండిన పంటలో సర్కారు 25% వంతు కూడా కొనలేదని.. రికార్డు స్థాయిలో సేకరించామని అసత్య ప్రచారం చేస్తున్నదని దుయ్యబట్టారు. శనివారం పరిగిలోని తన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. ఇటీవల వర్షాలు కురిసి ధాన్యం కల్లాల దగ్గరే ఉందని, కొనుగోలు కేంద్రాలకు తీసుకెళ్తే తాలు, పచ్చిగా ఉందని, మాయిశ్చర్ రావ డం లేదంటూ క్వింటాల్‌కు 10 కిలోల చొప్పున అక్క డి సిబ్బంది కట్ చేస్తున్నారని ఆరోపించారు. వికారాబాద్ జిల్లాలోని ఏ కొనుగోలు కేంద్రంలోనూ పూర్తిగా వడ్లు కొనలేదన్నారు.
సేకరణ సక్రమంగా సాగకపోవడంతో రైతులు కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నార ని, సర్కారు నిర్లక్ష్యంతో తక్కువ ధరకు వడ్లను బయ ట అమ్ముకునే పరిస్థితి నెలకొన్నదన్నారు. 30 నెలలు దాటినా పాలనపై కాంగ్రెస్‌కు పట్టు రాలేదని ఎద్దేవా చేశారు. సరిపడా యూరియా రావడం లేదని, విత్తనా లు లభించడం లేదని.. 24 గంటలు కరెంటు రావ డం లేదని, సాగునీటి వ్యవస్థ ఆందోళనకరంగా మా రిందన్నారు. కేవలం కేసీఆర్, కేటీఆర్‌లను తిట్టడం, బీఆర్ఎస్ నాయకులపై అక్రమ కేసులు పెట్టడం తప్ప కాంగ్రెస్ సర్కార్‌తో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. రైతులు పండించిన ధాన్యాన్ని పూర్తిస్థాయిలో కొనాలని డిమాండ్ చేశారు. ఈ నెల 15వ తేదీ వరకు వడ్లను కేంద్రం కొనకుంటే వాటిని కిషన్‌రెడ్డి ఇంటికి పంపిస్తామన్నారని.. 20 తేదీ వచ్చినా ఇంకా ఎప్పు డు తరలిస్తారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. వడ్లు కొనమని కేంద్రం చెబితే తాము ఇప్పటి నుంచి ఏ పంట నూ కొనమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.
రైతులకు న్యాయం జరిగే వర కు బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. సన్న ధాన్యానికి ఇచ్చే బోనస్‌ను ఎగ్గొట్టేం దు కు కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేస్తున్నదని.. అందుకే 8 రకాల వడ్లకే బోనస్ అని చెబుతున్నదని మండిపడ్డా రు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ సం పూర్ణంగా అమలు కాలేదని ఎద్దేవా చేశారు. రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి పూర్తిస్థాయి లో నెరవేర్చలేదన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ సాగునీటి రంగంపై ప్రత్యేక దృష్టి పెట్టి, అతి తక్కువ కాలంలోనే ప్రపంచంలోనే గొప్పదైన కాళేశ్వరాన్ని నిర్మించారని గుర్తు చేశారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులను 90 శాతం వరకు పూర్తి చేయించారని.. మిషన్ కాకతీయ పథకం కింద రాష్ట్రంలోని 45 వేల చెరువులను పూడిక తీయించడంతో నీటి నిలువ సామర్థ్యాన్ని పెంపొందించారన్నారు. 2014 కంటే ముందు రాష్ట్రంలో 60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరిగేదని, నేడు రెండున్నర కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి జరుగుతున్నదని.. దీనికి కార ణం కేసీఆర్ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేయడం, కొత్త ప్రాజెక్టుల నిర్మాణమని చెప్పారు. కేసీఆర్ ప్రభు త్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 24 గంటలపాటు ఉచిత విద్యుత్ వ్యవసాయానికి అందించారన్నారు.
రైతుబంధు కింద రైతులకు 11 పర్యాయాలు రూ.72 వేల కోట్లు పెట్టుబడి సాయాన్ని గత కేసీఆర్ ప్రభుత్వం అందించిందని, కేసీఆర్ హయాంలో రూ.29వేల కోట్ల రుణమాఫీ జరిగిందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ముకుంద అశోక్, మాజీ ఎంపీపీలు కరణం అరవిందరావు, మల్లేశం, మాజీ మార్కెట్ చైర్మన్ సురేందర్‌కుమార్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రాజేందర్, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, మల్లేశం, భాస్కర్, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు మాణిక్యం, కౌన్సిలర్లు రవికుమార్, రవీంద్ర, నరేశ్, బీఆర్ఎస్ నాయకులు ఆంజనేయులు, కృష్ణ, తాహెర్‌అలీ, రాజు, గౌస్‌పాషా పాల్గొన్నారు.