కడ్తాల్, ఫిబ్రవరి 15 : హామీల అమ ల్లో విఫలమైన ప్రభుత్వంపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపా ల్యాదవ్ అన్నారు. శనివారం మం డల కేంద్రంలోని ఆయన నివాసంలో నియోజకవర్గంలోని మండలాలు, మున్సిపాలిటీలకు చెందిన నాయ కు లు, కార్యకర్తలతో ఈ నెల 18న ఆమనగల్లు పట్టణంలో నిర్వహించనున్న రైతుదీక్షకు సంబంధించిన సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ వాటిని నెరవేర్చడంలేదని ఎద్దేవా చేశారు. హామీలను అమలు చేయకుండా ప్రతిపక్ష నాయకులను ఇబ్బందులు పెడు తూ..డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నదని మండిపడ్డారు.
మంగళవారం ఆమనగల్లు పట్టణంలో నిర్వహించనున్న రైతుదీక్షలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొంటారని తెలిపారు. దీనికి నాయకులు, అన్నదాతలు, భారీగా తరలివచ్చి సక్సెస్ చేయాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ వెంకటేశ్, పీఏసీఎస్ చైర్మన్ వెంకటేశ్‌గుప్తా, మున్సిపల్ మాజీ చైర్మన్ సత్యం, మాజీ జడ్పీటీసీలు దశరథ్‌నాయక్, అనురాధ, విజితారెడ్డి, మాజీ ఎంపీపీలు నిర్మల, శ్రీనివాస్‌యాదవ్, రాంరెడ్డి, జైపాల్‌నాయక్, సర్పంచ్ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి, ఆనంద్, పరమేశ్, శంకర్, రాజేందర్‌యాదవ్, రామకృష్ణ, మాజీ సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.
పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. ఈ నెల 17న మాజీ సీఎం కేసీఆర్ జన్మదినా న్ని పురస్కరించుకుని గ్రీన్ ఇండియా చాలెంజ్ ఆధ్వ ర్యంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొంటూ.. శనివారం మండల కేంద్రంలో వృక్షార్చన కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను జైపాల్‌యాదవ్ ఆవిష్కరించి మాట్లాడారు. కార్యక్రమంలో రవితేజ, నర్సింహగౌడ్, రాంరెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, విజయ్, ఆనంద్, గోవర్ధన్, వెంకటేశ్‌గుప్తా, జైపాల్‌రెడ్డి, లచ్చిరాంనాయక్, రమేశ్, శ్రీనూనాయక్, జంగయ్యగౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, ఖలీల్, సూర్యప్రకాశ్‌రావు, పాల్గొన్నారు.