కడ్తాల్ : వరంగల్‌లో ఈనెల 27న జరుగనున్న బీఆర్ఎస్ రజతోత్సవ బహిరంగ సభకు దం డులా తరలివెళ్లి సక్సెస్ చేద్దామని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ అన్నారు. ఆదివారం కడ్తాల్ మండల కేంద్రంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆమనగల్లు, కడ్తాల్, తలకొండపల్లి, మాడ్గుల మండలాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నా రు. ఈ సందర్భంగా జైపాల్‌యాదవ్ మాట్లాడుతూ.. రజతోత్సవ సభకు ప్రతి పల్లె నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, పార్టీ అభిమాను లు తరలిరావాలని పిలుపునిచ్చారు. ప్రభు త్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై, ఉద్యమ కార్యాచరణపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిశానిర్ద్దేశం చేయనున్నట్లు పేర్కొన్నా రు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచిందని..అయితే, ప్రస్తుతం కాంగ్రెస్ అసమర్థతతో రాష్ట్రంలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగట్టాలన్నారు. రజతోత్సవ సభకు కల్వకుర్తి నియోజక వర్గంలోని ఏడు మండలాలకు 35 బస్సులు కేటాయించడం జరిగిందన్నారు. అనంతరం సభకు సంబంధించిన వాల్‌పోస్టర్లను నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ఆవిష్కరించారు.
కార్యక్రమంలో మిషన్ భగీరథ మాజీ వైస్ చైర్మన్ ఉప్పల వెంకటేశ్, డీసీసీబీ డైరెక్టర్ వెంకటేశ్‌గుప్తా, ఏఎంసీ మాజీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీలు దశరథ్‌నాయక్, అనురాధ, విజితారెడ్డి, నర్సింహ, మాజీ ఎం పీపీ శ్రీనివాస్‌యాదవ్, బీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు పరమేశ్, అర్జున్‌రావు, జైపాల్‌రెడ్డి, శంకర్, మాజీ సర్పంచ్‌లు లక్ష్మీనర్సింహారెడ్డి, నర్సింహగౌడ్, కృష్ణారెడ్డి, శ్రీనూ నాయక్, వెంకటయ్య, జ్యోతయ్య, మాజీ ఎంపీటీసీలు లచ్చిరాంనాయక్, రమేశ్నా యక్, మాజీ ఉప సర్పంచ్ రామకృష్ణ, నాయకులు ముజీబూర్ రెహ్మాన్, శ్రీను, పత్యానాయక్, వీరయ్య, గోపా ల్, లాయక్‌అలీ, ధర్మారెడ్డి, ఖలీల్, మోహన్ రెడ్డి, పవన్‌కుమార్‌రెడ్డి, వినోద్, సాబేర్, వెంకటేశ్, శ్రీశైలం, రమేశ్, రామ చంద్రయ్య, కృష్ణ, అంజి, శ్రీకాంత్, సతీశ్, మల్లేశ్, గోపాల్‌గౌడ్ పాల్గొన్నారు.