ఆమనగల్లు : కాంగ్రెస్ ప్రభుత్వం ట్రిపులా ర్, గ్రీన్‌ఫీల్డ్ రోడ్ల పేరుతో పేదల భూములను కొల్లగొడుతున్నదని కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్ మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్‌లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్‌ను కలిసి..కల్వకుర్తి సెగ్మెంట్లో ట్రిపులార్, గ్రీన్‌ఫీల్డ్ రోడ్ల ఏర్పాటుతో భూములు కోల్పోతున్న రైతుల వివరాలను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాం గ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్నదాతలకు కష్టాలు మొదలయ్యాయని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను విస్మరించి, రాష్ట్రంలో రేవంత్ సర్కార్ రాక్షస పాలన సాగిస్తున్నదని మండిపడ్డారు. ప్రభుత్వంలో ఉన్న పెద్దలకు మేలు చేసేందుకే ట్రిపులార్ అలైన్‌మెంట్‌ను మార్చిందన్నారు.