కడ్తాల్ ఫిబ్రవరి 13: పాడి రైతులకు చెల్లించాల్సిన పెండింగ్ పాల బిల్లులను వెంటనే చెల్లించాలని మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్(Jaipal Yadav) డిమాండ్ చేశారు. గురువారం మండల కేంద్రంలోని హైదరాబాద్-శ్రీశైలం జాతీయ రహదారిపై పాడి రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సంఘీభావం తెలిపాయి. ఈ సందర్భంగా పాడి రైతులు పాలను రోడ్డుపై పారబోసి నిరసన వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో పాల్గొన్న జైపాల్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం సకాలంలో పాల బిల్లులు చెల్లించకపోవడంతో పాడి రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. 74 రోజులుగా పాల బిల్లులు రాకపోవడంతో పాడి రైతులకు పశు పోషణ భారమైందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం వెంటనే పాల బిల్లులను చెల్లించి పాడి రైతులనుఆదుకోవాలని డిమాండ్ చేశారు. అదే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతుబంధు, రుణమాఫీ పథకాలు సక్రమంగా అమలు కాలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ వెంకటేష్ గుప్తా, మాజీ జెడ్పిటిసి దశరథ్ నాయక్, మాజీ వైస్ ఎంపీపీ ఆనంద్, సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీ నరసింహ రెడ్డి, తలకొండపల్లి మండల బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శంకర్, బిజెపి మండల అధ్యక్షుడు మహేష్, బీఆర్ఎస్ కడ్తాల్ గ్రామ అధ్యక్షుడు రామకృష్ణ, నాయకులు గంప శీను, దశరథం, మోహన్ రెడ్డి, ఎలమందరెడ్డి, జంగయ్య, జగన్ యాదవ్ మహేష్, నరసింహ, అశోక్ రెడ్డి, శేఖర్, రాములుయాదవ్, యాదయ్య, పాడి రైతులు పాల్గొన్నారు.