Shabad Accused | రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో జరిగిన ఆరు హత్యల కేసు నిందితుడు రాజ్‌కుమార్ పోలీసుల అదుపులో ఉన్నాడన్న ప్రచారాన్ని చేవెళ్ల డీసీసీ యోగేశ్ గౌతమ్ ఖండించారని తెలిసిందే. నిందితుడు మా అదుపులో ఉన్నాడన్న ప్రచారం వాస్తవం కాదని స్పష్టం చేశారు. నిందితుడు చేగూరు రైల్వే ట్రాక్ దాటి అటవీప్రాంతంలోకి వెళ్లినట్లుగా అనుమానిస్తున్నామని డీసీపీ తెలిపారు. రాజ్‌కుమార్ శుక్రవారం రాత్రి 11 .47 గంటలకు తన మొబైల్ స్విచ్చాఫ్ చేశాడని పేర్కొన్నారు. రాజ్‌కుమార్ కోసం 8 బృందాలు గాలిస్తున్నాయని తెలిపారు.
ఇదిలా ఉంటే తిమ్మాపూర్ సమీపంలో నిందితుడు రాజ్‌కుమార్ (అనుమానంతో)ను కానిస్టేబుల్ పట్టుకున్నాడని చెప్పుకొచ్చాడు. ప్రత్యక్ష సాక్షి మాట్లాడుతూ.. ఆయన నడుచుకుంటూ వచ్చి జామకాయ చేతులో పట్టుకుని ఈ చెట్టు దగ్గర నిలబడ్డడు. ఆయన ఒక్కడే ఉన్నడు.. వెంబడి ఎలాంటి వాహనాలు కూడా లేవు. అన్నా టిఫిన్ ఎక్కడుంటది అంటే తిమ్మాపూర్‌లో ఉంటదని చెప్పిన. వేరే బండి ఆపి ఆ బండి మీద వెళ్తున్నడు. అప్పుడే కానిస్టేబుల్ చూడగానే అతడు బండి ఆపి దానిపై నుంచి దూకి ఉరికిండు. కానిస్టేబుల్ అతన్ని వెంబడించి పట్టుకుని వెళ్లిండు. మరి అతడేనా..కాదా..? అనేది తెల్వదన్నాడు. ఇంతకీ మరి పోలీసులు పట్టుకున్నది నిందితుడైన రాజ్కుమార్నే అయి ఉంటుందా..? లేదా..? అనేది క్లారిటీ రావాల్సి ఉంది.
మరోవైపు ఆరు హత్యలు జరిగిన 36 గంటలు దాటినా నిందితుడి ఆచూకీని కనిపెట్టకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. మరోవైపు ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పిన రాజ్‌కుమార్ ఎక్కడకు వెళ్లాడనేది ఇప్పుడు పెద్ద చిక్కు ప్రశ్నగా మిగిలిపోయింది. నిందితుడి కారు తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ సమీపంలో దొరకగా.. మొబైల్ లొకేషన్ కూడా అక్కడే అగిపోయింది. కారును రైల్వే స్టేషన్ సమీపంలో వదిలేసిన రాజ్‌కుమార్ కొత్తూరు మండలం తిమ్మాపూర్ రైల్వే స్టేషన్ లోపలికి వెళ్లినట్లు గుర్తించారు. దీంతో రాజ్‌కుమార్ నందిగామలో రైలు ఎక్కాడా.. ఎక్కడితే ట్రైన్ ఎక్కడ దిగాడనేది ఇప్పుడు ప్రశ్నంగా మారింది. కాగా రాజ్‌కుమార్ ఆచూకీని తెలిపితే రెండు లక్షల రూపాయల రివార్డు ఇస్తామని పోలీసులు ప్రకటించారు.
పోలీసుల అదుపులో షాబాద్ పోక్సో కేసు నిందితుడు రాజ్ కుమార్
తిమ్మాపూర్ సమీపంలో ఓ కానిస్టేబుల్ వెంబడించి పట్టుకున్నాడని చెప్తున్న ప్రత్యక్ష సాక్షి https://t.co/bYs4XjqDQM pic.twitter.com/Gi1GvJLpIp
— Telugu Scribe (@TeluguScribe) July 12, 2026